![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ అంటే చాలు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ ని బయటకు వచ్చాక మరో యాంకర్ వంకటింకరగా, కాంట్రవర్సీగా ప్రశ్నలు అడిగే ఒక ప్రాసెస్ అనేదాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఐతే ఈ బిగ్ బాస్ సీజన్ 7 లో గలాటా గీతూ అలాగే హౌస్ మేట్స్ ని ఎన్నో ప్రశ్నలు అడిగింది.
ఏ విషయాన్ని ఐనా ముఖం మీదే అడిగేసి కడిగేసి, కౌంటర్ వేసి మరీ రచ్చ చేసేస్తుంది ఈ అమ్మడు. ఐతే ఆడియన్స్ అంతా కూడా ఈ గీతూనే ఈ క్వశ్చనీర్ ని ప్రిపేర్ చేసుకుంది అనుకున్నారు.. కానీ ఆ ప్రశ్నలు రాసుకుంది తానూ కాదనే విషయాన్నీ ఆ సీక్రెట్ ని ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఐతే బిగ్ బాస్ బజ్ స్టార్ట్ చేసే టైంకి వాళ్ళ అమ్మగారికి బాగోకపోవడం అలాగే తన పిల్లి పిల్లకు కూడా అనారోగ్యం పాలవడం వంటి విషయాలను అప్పట్లో తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన విషయం మనకు తెలుసు. ఐతే ఈ టెన్షన్స్ మధ్య తనకు బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూడడం కుదరక తాను ప్రశ్నలను ప్రిపేర్ చేసుకోలేకపోయాను అని చెప్పింది. అందుకే తనకు ప్రశ్నలు రాసివ్వమంటూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఆదిరెడ్డిని హెల్ప్ అడిగినట్లు చెప్పింది గీతూ. ఐతే ఆదిరెడ్డి విజయవాడలో తన సలోన్ నిర్మాణంలో ఎంతో బిజీగా ఉన్నా కూడా తనకు ప్రశ్నలను ప్రిపేర్ చేసి ఇచ్చేవాడని చెప్పింది. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కి కూడా హెల్ప్ అడగడంతో అందరి నుంచి తీసుకున్న క్వశ్చన్స్ నుంచి కొన్నిటిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుని కంటెస్టెంట్స్ అడిగినట్లు చెప్పింది. ఆదిరెడ్డి రీవ్యూల కోసం షో మొత్తం ఫాలో అయ్యేవాడని కాబట్టి తనకు ప్రశ్నలు రాసివ్వడం పెద్ద కష్టమయ్యేది కాదని అసలు సీక్రెట్ రివీల్ చేసింది గలాటా గీతూ.
![]() |
![]() |